రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: వైద్యులు, వైద్యారోగ్య సిబ్బందిపై దాడి చేసినవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాడి చేసినవారిపై ఎపిడమిక్ డిసీజెస్(సవరణ) చట్టం 2020 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖలో తెలిపారు. కరోనాలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, దాడులకు గురైనప్పుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవచ్చని, అది మొత్తం వైద్యారోగ్య వ్యవస్థకే ముప్పుగా మారే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో విచారించి శిక్ష విధించాలని […]
న్యూఢిల్లీ: వైద్యులు, వైద్యారోగ్య సిబ్బందిపై దాడి చేసినవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాడి చేసినవారిపై ఎపిడమిక్ డిసీజెస్(సవరణ) చట్టం 2020 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖలో తెలిపారు. కరోనాలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, దాడులకు గురైనప్పుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవచ్చని, అది మొత్తం వైద్యారోగ్య వ్యవస్థకే ముప్పుగా మారే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో విచారించి శిక్ష విధించాలని వివరించారు. ఈ చట్టం కింద దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించవచ్చు.