ఈ ఏడాది ‘జనగణన’ లేనట్టే!

న్యూఢిల్లీ: జనగణన మొదటి దశ, నేషనల్ పాపులేసన్ రిజిస్టర్(NPR) నవీకరణ ప్రక్రియ ఈ ఏడాది ఉండబోదని తెలుస్తున్నది. ఈ ఏడాది నిర్వహించడానికి షెడ్యూల్ ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఇప్పటికే వాయిదాపడింది. కానీ, కరోనా నిర్మూలన కనుచూపుమేరలో కనిపించకపోవడంతో ఈ ఏడాది కూడా జనగణన, ఎన్‌పీఆర్ ప్రక్రియ ఉండబోదనని విశదమవుతున్నదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. జనగణన ఇప్పుడు అత్యవసర ప్రక్రియ కాదని, దీన్ని మరో ఏడాది వాయిదా వేసినప్పటికీ సమస్య ఉండబోదని అన్నారు. భారత జనగణన బృహత్ […]

Update: 2020-08-30 08:24 GMT

న్యూఢిల్లీ: జనగణన మొదటి దశ, నేషనల్ పాపులేసన్ రిజిస్టర్(NPR) నవీకరణ ప్రక్రియ ఈ ఏడాది ఉండబోదని తెలుస్తున్నది. ఈ ఏడాది నిర్వహించడానికి షెడ్యూల్ ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఇప్పటికే వాయిదాపడింది. కానీ, కరోనా నిర్మూలన కనుచూపుమేరలో కనిపించకపోవడంతో ఈ ఏడాది కూడా జనగణన, ఎన్‌పీఆర్ ప్రక్రియ ఉండబోదనని విశదమవుతున్నదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

జనగణన ఇప్పుడు అత్యవసర ప్రక్రియ కాదని, దీన్ని మరో ఏడాది వాయిదా వేసినప్పటికీ సమస్య ఉండబోదని అన్నారు. భారత జనగణన బృహత్ ప్రక్రియ. ఇందులో కనీసం 30 లక్షల అధికారులు సేవలందిస్తారు. లక్షలాది మంది అధికారులు ఇంటింటికీ తిరగాల్సి ఉంటుందని, దీని ద్వారా కరోనా వ్యాపించే ముప్పు లేకపోలేదని ఆ అధికారి వివరించారు.

సాధారణంగా మనదేశంలో జనగణన దశాబ్దానికి ఒకసారి నిర్వహిస్తుంటారు. 2021 జనాభా లెక్కల కోసం ఈ ఏడాదిలోనే ప్రక్రియ మొదలు కావల్సింది. జనగణన, ఎన్‌పీఆర్ ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉండగా, కరోనా ప్రవేశించడం, దాని కట్టడికి లాక్‌డౌన్‌ల కారణంగా కేంద్రం వాయిదా వేసింది. ఈ ఏడాది మాత్రం ఈ ప్రక్రియ జరిగే అవకాశం స్వల్పమేనని, అయితే, తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉన్నదని మరో అధికారి తెలిపారు.

Tags:    

Similar News