సెలెబ్రిటీల నోట జై శ్రీరామ్..

హిందువులు ఎన్నో దశాబ్దాలుగా వేచిన అపూర్వఘట్టం నేడు ఆవిష్కృతమైంది. అయోధ్యలో శ్రీరామ మందిరానికి నేడు భూమిపూజ జరగగా, ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ వెండి ఇటుకతో పునాది రాయి వేశారు. వచ్చే మూడున్న‌రేండ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయ‌నుండగా.. ఉత్స‌వంగా జ‌రుగుతున్న భూమి పూజ‌పై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. సామాన్య‌ులు, సెల‌ెబ్రిటీలు కూడా ఈ అద్భుత ఘట్టాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారు. ‘అయోధ్య రాముడు ఆనందించేలా, భారతదేశం గర్వించేలా, ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా, ఎదురులేని తిరుగులేని […]

Update: 2020-08-05 06:57 GMT

హిందువులు ఎన్నో దశాబ్దాలుగా వేచిన అపూర్వఘట్టం నేడు ఆవిష్కృతమైంది. అయోధ్యలో శ్రీరామ మందిరానికి నేడు భూమిపూజ జరగగా, ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ వెండి ఇటుకతో పునాది రాయి వేశారు. వచ్చే మూడున్న‌రేండ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయ‌నుండగా.. ఉత్స‌వంగా జ‌రుగుతున్న భూమి పూజ‌పై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. సామాన్య‌ులు, సెల‌ెబ్రిటీలు కూడా ఈ అద్భుత ఘట్టాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారు.

‘అయోధ్య రాముడు ఆనందించేలా, భారతదేశం గర్వించేలా, ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా, ఎదురులేని తిరుగులేని మొక్కవోని సాహసంతో పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ, శ‌తథా సహస్రథా.. వందనం అభివందనం’ అంటూ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

‘500 ఏళ్ల నాటి కల సాకారం అవుతోంది. రామ మందిర కలను నిజం చేసిన మోదీకి కృతజ్ఞతలు. మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు.. జై శ్రీరామ్’ – హేమమాలిని

‘శ్రీరాముడు పుట్టినటువంటి రామ జన్మభూమిలో.. రామమందిరానికి భూమి పూజ జరగడం.. నిజంగా ఇది రాముని విజయం. రామ మందిరం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు. ఈ రోజు జరుగుతున్న భూమిపూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరగాలి. ఇది శ్రీరాముని విజయం. శ్రీ హనుమంతుడి విజయం’ – కన్నడ నటి రచితా రామ్

‘అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు చిరకాల వాంఛ. దాన్ని నిజం చేస్తున్న హిందూ హృదయ సామ్రాట్ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ.. హిందూ బంధువులందరికీ, అలాగే భారతీయులందరికీ ఆ రామయ్య దీవెనలు లభించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు.. ప్రేమతో’ – మాధవీలత పసుపులేటి

ఇక బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్.. జై శ్రీరామ్ అంటూ మెసేజ్ చేశాడు. బాలీవుడ్ నటుడు అనుప‌మ్ ఖేర్.. మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు రామజ‌న్మ భూమి పూజ శుభాకాంక్ష‌లు అని తెలిపారు. ఇక కంగ‌నా ర‌నౌత్ కూడా రామ మందిరం భూమి పూజ‌కు సంబంధించి సంతోషం వ్య‌క్తం చేస్తూ.. జై శ్రీరామ్ అని తెలిపింది.

Tags:    

Similar News