సెలెబ్రిటీల చేతుల్లో.. ఈ పుస్తకాలు
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచాన్ని మరో కోణంలో చూడాలంటే పుస్తకాలు చదవాలి. కరోనా ప్రభావంతో.. సెలెబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. సెలెబ్రిటీల విషయానికొస్తే.. వాళ్లలో చాలామంది కరోనా టైమ్‌ను పుస్తకాలు చదవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ సోనమ్ కపూర్, సోనాలి బింద్రే, అనిల్ కపూర్‌లతో పాటు ప్రముఖ అమెరికన్ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ప్రే, అమెరికన్ నటి రీసె విథర్‌స్పూన్ జులైలో కొన్ని పుస్తకాలు చదవాలని నిశ్చయించుకున్నారు. సోనమ్ […]
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రపంచాన్ని మరో కోణంలో చూడాలంటే పుస్తకాలు చదవాలి. కరోనా ప్రభావంతో.. సెలెబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. సెలెబ్రిటీల విషయానికొస్తే.. వాళ్లలో చాలామంది కరోనా టైమ్‌ను పుస్తకాలు చదవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ సోనమ్ కపూర్, సోనాలి బింద్రే, అనిల్ కపూర్‌లతో పాటు ప్రముఖ అమెరికన్ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ప్రే, అమెరికన్ నటి రీసె విథర్‌స్పూన్ జులైలో కొన్ని పుస్తకాలు చదవాలని నిశ్చయించుకున్నారు.
సోనమ్ కపూర్ : ఈ బాలీవుడ్ బ్యూటీకి పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టమని తన అభిమానులందరికీ తెలిసిందే. సోనమ్ తాజాగా.. ‘50 గ్రేటెస్ట్ షార్ట్ స్టోరీస్’ అనే పుస్తకాన్ని చదువుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘కరోనా నుంచి మనమంతా సేఫ్‌గా ఉండటానికి పోరాటం చేస్తున్నాం. ఇది చాలా వింత అనుభవం. ఈ కరోనా పాండమిక్ రోజుల్లో.. పుస్తకాల్లోనే సమయాన్ని గడపాలని మా ఫ్యామిలీ అంతా నిర్ణయించుకున్నాం. సో మా కపూర్ ఫ్యామిలీ గ్రూపులో ప్రతి నెల మేము చదివిన పుస్తకం డీటెయిల్స్ పెడతాం. అయితే.. కపూర్-అహుజా క్వారంటైన్ రీడ్స్ నుంచి మీకోసం కొన్ని పుస్తకాలు పంచుకుంటున్నాను. మీకు అవకాశం ఉంటే.. ఈ బుక్స్ చదువుతారని ఆశిస్తున్నాను’ అని సోనమ్ తెలిపింది. 50 గ్రేటెస్ట్ షార్ట్ స్టోరీస్ పుస్తకాన్ని టెర్రి ఓబ్రెయిన్ రాశారు.
అనిల్ కపూర్, రియా కపూర్ : అనిల్ కపూర్ జులైలో.. ‘లెట్ మీ సే ఇట్ నౌ’ చదవగా, రియా కపూర్ ‘ఏ గర్ల్ అండ్ హర్ గ్రీన్స్ : హార్లీ మీల్స్ ఫ్రమ్ ద గార్డెన్’ చదువుతున్నారు. ఇక సోనమ్ తల్లి సునీతా కపూర్ ‘ద ఫారెస్ట్ ఆఫ్ ఎంచాట్‌మెంట్స్’ చదువుతుండగా, సోనమ్ భర్త ‘మై గీత ’ను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.
సోనాలీ బింద్రే : జులై 2020లో ఈ అందాల తార ‘అన్ టేమ్డ్’ బుక్ చదువుతోంది. గ్లెనన్ డాయెల్స్ రాసిన ఈ పుస్తకం అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ పుస్తకం ఎందుకు చదువుతుందో కూడా సోనాలి అభిమానులతో పంచుకుంది. ‘మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలా? తిరిగి పొందడం ఎలా? ఈ పరిస్థితుల్లో ఈ పుస్తకం చదవడం ఎంతో అవసరం. చాలా ఉత్తమమైన పుస్తకం’ అని రాసుకొచ్చింది.
ఓప్రా విన్‌ఫ్రే : జేమ్స్ మ్యాక్ బ్రైడ్స్ ‘డెకాన్ కింగ్ కాంగ్’ పుస్తకాన్ని ఓప్రా చదువుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో వర్ణ వివక్ష, జాత్యాహంకార ధోరణులు అధికమవుతున్న నేపథ్యంలో ఓప్రా ఈ పుస్తకాన్ని చదవడానికి ఆసక్తి చూపించారు. అంతేకాదు ఈ పుస్తకాన్ని షేర్ చేస్తూ.. ‘బ్లాక్అవుట్ బెస్ట్ సెల్లర్ లిస్ట్ చాలెంజ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. హాలీవుడ్ నటి సారా జెస్సికా పార్కర్ కూడా ఈ పుస్తకాన్ని చదవమని తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా రికమెండ్ చేసింది. అంతేకాదు ఈ పుస్తకం ఆధారంగా టీవీ సిరీస్ కూడా రాబోతున్నట్లు సమాచారం.
రీసా విథర్‌స్పూన్ : బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హాలీవుడ్ నటి.. ‘ఐ యామ్ స్టిల్ హియర్ : బ్లాక్ డిగ్నిటీ ఇన్ ఏ వరల్డ్ మేడ్ ఫర్ వైట్‌నెస్ ’ పుస్తకాన్ని చదువుతోంది.