ప్రకృతిని పదిలంగా ఉంచుదాం..

ఎవడికి సొంతం ఇదంతా.. ఇది ఎవ్వడు నాటిన పంటా.. ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే యెట్టా.. ప్రకృతి గురించి రామజోగయ్య శాస్త్రి రాసిన పాట ఇది. ఈ భూమి మీదకి మనం అతిథుల్లా వచ్చాం.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవాలి .. అంతే తప్పా.. ప్రకృతిని చేతుల్లోకి తీసుకుని నాశనం చేస్తే ఇలాంటి కరోనా వైరస్‌లు మనమీద దాడికి సిద్ధంగా ఉంటాయి. అసలు మానవమనుగడ అనేదే లేకుండా చేస్తాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కనీసం […]

Update: 2020-06-05 05:03 GMT

ఎవడికి సొంతం ఇదంతా.. ఇది ఎవ్వడు నాటిన పంటా.. ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే యెట్టా.. ప్రకృతి గురించి రామజోగయ్య శాస్త్రి రాసిన పాట ఇది. ఈ భూమి మీదకి మనం అతిథుల్లా వచ్చాం.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవాలి .. అంతే తప్పా.. ప్రకృతిని చేతుల్లోకి తీసుకుని నాశనం చేస్తే ఇలాంటి కరోనా వైరస్‌లు మనమీద దాడికి సిద్ధంగా ఉంటాయి. అసలు మానవమనుగడ అనేదే లేకుండా చేస్తాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం .. ప్రకృతికి హాని తలపెట్టకుండా జీవిద్దాం అని పిలుపునిస్తున్నారు సినీ ప్రముఖులు.

సమతుల్య పర్యావరణం నిర్మించుకుందాం

మనమందరం నివసించే పర్యావరణాన్ని పరిరక్షించడం మన బాధ్యత అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. భూమి మీద జీవులన్నీ ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయన్న ఆయన.. ప్రకృతిని కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే అన్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయాలు మానవ జీవితం యొక్క దుర్భలత్వాన్ని బయటపెడతాయన్న మహేష్.. మనం ఆరోగ్యంగా జీవించాలంటే .. ఆరోగ్యకరమైన, సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఇంట్లో సురక్షితంగా ఉండగానే.. మన చర్యల్లో, మన మాటల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ మానవజాతి మనపై ఆధారపడి ఉంది. నీరు, చెట్లు, విద్యుత్‌ను ఆదా చేయండి.. కర్బన ఉద్గారాలను తగ్గించాలని.. అడవులు, సముద్రాలు, జంతువులను కాపాడమని కోరారు. ఇందులో మీకు ఏది ముఖ్యం అనిపిస్తుందో.. అది ఈ రోజే ప్రారంభించమని కోరారు.

తప్పు చేశాం.. సరిదిద్దుకుందాం..

ప్రకృతి తల్లి తల్లడిల్లితే ఏ ఒక్కరం మిగలం అని హెచ్చరిస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. భవిష్యత్ తరాల రక్షణను దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ప్రకృతిని మనం గౌరవించలేదు.. కరోనా వచ్చింది.. ఇన్ని కష్టాలు పెడుతుంది. ఏమి తప్పు చేశామో మనమే ఆలోచించుకోవాలి.. సరిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.

నీటిని ఆదా చేద్దాం

ఈ రెండు నెలలుగా మనం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కనీసం ఇప్పటికైనా తప్పును అర్థం చేసుకుని.. మారుదామని పిలుపునిస్తున్నారు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. నీటిని చాలా పొదుపుగా వినియోగించాలని కోరారు. కరోనా వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీటి అవసరం చాలా ఉంది. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాల్సి ఉంది.. ఇది చాలా కీలకమైన సహజ వనరు అని.. నీటిని ఆదా చేయడంలో మీ వంతు కృషి చేయాలని కోరారు. లేదంటే మన భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు అధికమవుతాయని హెచ్చరించారు.

భూమిని మరింత అందంగా తీర్చిదిద్దుకుందాం

తన ఇంట్లో ఉన్న చెట్టు జీవితంలో భాగమైపోయిందని తెలిపిన మంచు లక్ష్మీప్రసన్న.. ఇప్పుడు నా కూతురి జీవితంలోనూ భాగమైందన్నారు. ఇది చాలా గొప్ప జ్ఞాపకమన్న లక్ష్మీ ప్రసన్న.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెట్లను కాపాడాలని పిలుపునిస్తుంది. తల్లి ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిని ప్రతి ఒక్కరూ గుర్తించి.. కృతజ్ఞతలు తెలుపుకోవాలని కోరింది, ఈ అందమైన భూ గ్రహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకుందామని కోరుతుంది.

ప్రకృతిని ప్రేమిద్దాం

భగవంతుడు మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ఎంత అందంగా సృష్టించాడో కదా అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. అలాంటి అందమైన ప్రకృతిని ఆరాధించాలే తప్పా నాశనం చేయరాదన్నారు. ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ జీవించేలా సృష్టిలో అన్ని జీవజాతులను చాలా చక్కగా తీర్చిదిద్దారు. కాబట్టి తల్లి ప్రకృతి యొక్క లయను విచ్ఛిన్నం చేయకుండా ఉండాలని కోరింది. ఈ రోజు కరోనా కారణంగా పడుతున్న బాధలు మనం ఏమి ఎంచుకున్నామో.. ఎలా ఎంచుకున్నామో.. దాని ఫలితమేనని నేను నమ్ముతున్నాను అంటున్న కృతి.. ఇప్పటి నుంచైనా ప్రకృతి ప్రేమికుల్లా ఉందామని పిలుపునిస్తుంది.

ప్రకృతి అన్నింటిని ప్రసాదించింది

ప్రకృతి మాత మనకు అన్నింటిని అందించిందన్నారు యంగ్ హీరో అల్లు శిరీష్. ఆ తల్లిని కాపాడుకోవడం మన సామూహిక బాధ్యత అని సూచించారు. మొక్కలను పోషించడం, నీటిని ఆదా చేయడం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు నేను ప్రయత్నిస్తాను.. మరి మీ సంగతేంటని ప్రశ్నిస్తున్నాడు శిరీష్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజే ప్రారంభిస్తే బాగుంటుదన్నారు.

Tags:    

Similar News