సీపీఎస్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్ ‘1’ పెన్షన్ విద్రోహం దినం- టీయస్ యుటీఎఫ్

దిశ,కొడంగల్: సీపీఎస్ పెన్షన్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ పాఠశాలల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలనీ టీఎస్ యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకం అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు శాపంగా మారిన కంట్రీబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలనీ కోరుతూ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయుస్పీసి), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి […]

Update: 2021-08-31 09:16 GMT

దిశ,కొడంగల్: సీపీఎస్ పెన్షన్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ పాఠశాలల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలనీ టీఎస్ యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకం అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు శాపంగా మారిన కంట్రీబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలనీ కోరుతూ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయుస్పీసి), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పిలుపు మేరకు సెప్టెంబర్1 ని పెన్షన్ విద్రోహదినంగా పాటించాలన్నారు.

ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయా పాఠశాలల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొన్నారు. గత 17 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తున్నారన్నారు. పోరాటాల ఫలితంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామన్నారు.

Tags:    

Similar News