4 రెట్లు పెరిగిన సియట్ త్రైమాసిక లాభం
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ టైర్ల తయారీ సంస్థ సియట్ నికర లాభం ఏకంగా నాలుగు రెట్లు పెరిగి రూ. 182.18 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 43.64 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 1,978.47 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 1,691.55 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ టైర్ల తయారీ సంస్థ సియట్ నికర లాభం ఏకంగా నాలుగు రెట్లు పెరిగి రూ. 182.18 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 43.64 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 1,978.47 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 1,691.55 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. కొవిడ్-19 సంక్షోభం వల్ల ఏర్పడ్డ అడ్డంకులను అధిగమించి ఆగష్టు చివరి వారంలో ఉత్పత్తిని ప్రారంభించినట్టు కంపెనీ వెల్లడించింది. మార్కెట్లో ఉన్న డిమాండ్, మొత్తం సామర్థ్యం ఆధారంగా ప్లాంట్ లలో ఉత్పత్తిని మరింత పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది.