Economy: యూఎస్ పరస్పర సుంకంతో భారత జీడీపీపై ప్రతికూల ప్రభావం: నిపుణులు

అమెరికాకు భారత ఎగుమతులు 2-3 శాతం క్షీణిస్తాయని ఈవ చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకె శ్రీవాస్తవ చెప్పారు.

Update: 2025-04-03 13:00 GMT
Economy: యూఎస్ పరస్పర సుంకంతో భారత జీడీపీపై ప్రతికూల ప్రభావం: నిపుణులు
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన 27 శాతం పరస్పర సుంకాల కారణంగా భారత జీడీపీపై 50 బేసిస్ పాయింట్ల మేర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశ వృద్ధి రేటు 6 శాతానికి తగ్గవచ్చని గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ పరిణామాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు 2-3 శాతం క్షీణిస్తాయని ఈవై చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకె శ్రీవాస్తవ చెప్పారు. అయితే, జీడీపీపై 50 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఆయన పష్టం చేశారు. అమెరికాకు భారతీయ ఎగుమతులపై 20 శాతం వరకు సుంకం పెరుగుదల వల్ల జీడీపీ వృద్ధికి 35-40 బేసిస్ పాయింట్ల వరకు ప్రతికూల ప్రభావం ఉంటుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా హెడ్ అనుభవి సహాయ్ తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపాదిత టారిఫ్‌లపై ఇరు దేశాలు ఎలాంటి చర్చలు నిర్వహిస్తాయి, అనే దానితో పాటు భారత్-యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆధారపడి తుది ప్రభావం ఉంటుందని సహాయ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువ ప్రభావం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆసియాలోని ఇతర దేశాలు భారత్ కంటే అత్యధిక పన్ను కారణంగా అమెరికాతో అధిక వాణిజ్య మిగులును ఎదుర్కొననున్నాయి. తద్వారా భారత ఆర్థికవ్యవస్థపై తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు, అమెరికా సుంకాల పెంపు నిర్ణయం మూలంగా ద్రవ్యోల్బణం అస్థిరతకు లోనవ్వొచ్చు. ఫలితంగా అమెరికా డాలర్ ఒత్తిడికి గురవుతుందని, భారత రూపాయి మారకానికి ఇది అనుకూలమని శ్రీవాస్తవ చెప్పారు. అధిక సుంకాల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అమెరికా నుంచి ముడి చమురు, గ్యాస్, విమానాలు, అణు రియాక్టర్లు, రక్షణ సంబంధిత అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల దిగుమతులను పెంచడం ద్వారా వాణిజ్య మిగులును తగ్గించుకోవచ్చని శ్రీవాస్తవ పేర్కొన్నారు. 

Tags:    

Similar News