Stock Updates: లాభాల బాటలో స్టాక్ మార్కెట్ సూచీలు.. ఏకంగా 986 పాయింట్ల ప్రాఫిట్

నిఫ్టీ 23,600 దాటడం, సెన్సెక్స్ 500 పాయింట్లకు‌పైగా పెరగడంతో భారత బెంచ్‌మార్క్ సూచీలు రెండో అర్ధ భాగంలో తిరిగి ఊపందుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి.

Update: 2025-04-17 07:43 GMT
Stock Updates: లాభాల బాటలో స్టాక్ మార్కెట్ సూచీలు.. ఏకంగా 986 పాయింట్ల ప్రాఫిట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నిఫ్టీ (NIFTY) 23,600 దాటడం, సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరగడంతో భారత బెంచ్‌మార్క్ సూచీలు రెండో అర్ధ భాగంలో తిరిగి ఊపందుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి. తాజా సమాచారం మేరకు సెన్సెక్స్‌ 986 పాయింట్ల లాభంతో 78,027 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (NIFTY) 267 పాయింట్ల లాభంతో 23,704 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech), టాటా స్టీల్ (TATA Steel), టెక్ మహీంద్రా (Tech Mahindra), టీసీఎస్ (CS), లార్సెన్ & టూబ్రో, టైటాన్ సంస్థలు ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థలు ఫస్ట్ సెషన్‌లో కీలక లాభాలను ఆర్జించాయి. 

Tags:    

Similar News