నెలకు రూ.50వేలు.. త్రిదళాధిపతి విరాళం
న్యూఢిల్లీ: కొవిడ్ 19పై పోరుకోసం పీఎం కేర్స్ ఫండ్‌కు త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్ ఏడాదిపాటు ప్రతినెలా రూ. 50వేల విరాళం ఇవ్వనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ విరాళాన్ని ఇస్తున్నారు. మిగితా నెలల్లోనూ నేరుగా తన జీతం నుంచి రూ. 50వేలు పీఎం కేర్స్ ఫండ్‌కు కేటాయించే ఏర్పాటు చేసుకున్నారు. తన వేతనం నుంచి ఈ మొత్తం నేరుగా పీఎం కేర్స్ ఫండ్‌కు వెళ్లేలా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన మార్చిలోనే అడిగినట్టు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. […]
న్యూఢిల్లీ: కొవిడ్ 19పై పోరుకోసం పీఎం కేర్స్ ఫండ్‌కు త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్ ఏడాదిపాటు ప్రతినెలా రూ. 50వేల విరాళం ఇవ్వనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ విరాళాన్ని ఇస్తున్నారు. మిగితా నెలల్లోనూ నేరుగా తన జీతం నుంచి రూ. 50వేలు పీఎం కేర్స్ ఫండ్‌కు కేటాయించే ఏర్పాటు చేసుకున్నారు. తన వేతనం నుంచి ఈ మొత్తం నేరుగా పీఎం కేర్స్ ఫండ్‌కు వెళ్లేలా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన మార్చిలోనే అడిగినట్టు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఒక రోజు జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు కేటాయించిన ఆర్మీ సిబ్బంది జాబితాలో రావత్ కూడా చేరారు. సీడీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర సీనియర్ అధికారులు కోవిడ్ 19పై పోరాడేందుకు విరాళాలు ఇచ్చేందుకు ప్రోత్సహిస్తుందని డిఫెన్స్ వర్గాలు వివరించాయి.