నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజ్

దిశ, హుస్నాబాద్: గత నెల 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28వ తేదీ రాత్రి హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ గ్రామ శివారు బ్రిడ్జిపై గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మీ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు […]

Update: 2020-10-07 09:48 GMT

దిశ, హుస్నాబాద్: గత నెల 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు.

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28వ తేదీ రాత్రి హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ గ్రామ శివారు బ్రిడ్జిపై గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మీ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందినట్లు వెల్లడించారు. హుస్నాబాద్ ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని పలు ఆధారాలను సేకరించడంతో పాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారన్నారు. యాదగిరిగుట్ట ధర్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గవ్వల సిద్ధిరాములు లారీ ఆటోను ఢీకొట్టినట్లు గుర్తించామన్నారు. లారీ డ్రైవర్‎పై కేసు నమోదు చేసి రిమాండ్‎కు పంపించినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించిన క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ టి.రవిని సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై శ్రీధర్ పోలీస్ సిబ్బంది తదితరులు శాలువాతో సత్కరించి నగదు బహుమతిని అందించారు.

Tags:    

Similar News