బిగ్ బ్రేకింగ్: CBSE పరీక్షలు రద్దు

దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపిస్తున్న క్రమంలో CBSE 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షల నిర్వహణపై చర్చించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు వేయాలని ఈ సమావేశంలో మోడీ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండటం, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో చివరికి […]

Update: 2021-04-14 03:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపిస్తున్న క్రమంలో CBSE 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షల నిర్వహణపై చర్చించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు వేయాలని ఈ సమావేశంలో మోడీ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండటం, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో చివరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.

ప్రస్తుతం కేవలం 10 తరగతి సీబీఎస్‌ఈ పరీక్షలను మాత్రమే రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో మరోసారి మోడీ సమావేశం కానున్నాయి. 10వ తరగతి విద్యార్థులను ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేయనున్నారు.

షెడ్యూలు ప్రకారం సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మే 10 నుంచి ప్రారంభమవ్వాల్సి ఉండగా.. జూన్ రెండో వారంలో ముగిసేవి. కానీ గడిచిన నెల రోజులుగా దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు పంపలేమని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడితే.. వారే వైరస్ హాట్‌స్పాట్ లుగా మారతారని నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను నిర్వహించడం శ్రేయస్కరం కాదని నిర్ణయానికి వచ్చింది.

Tags:    

Similar News