సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10వ, 12వ తరగతి పరీక్షలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించబోమని, పరిస్థితుల ఆధారంగా ఫైనల్ డేట్లను ఖరారు చేస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులతో ఆయన ఆన్‌లైన్‌‌లో మాట్లాడుతూ… సీబీఎస్ఈ సిలబస్‌ను తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 30శాతం కుదించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణంగా జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి-మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామని, కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా […]

Update: 2020-12-22 06:40 GMT

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10వ, 12వ తరగతి పరీక్షలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించబోమని, పరిస్థితుల ఆధారంగా ఫైనల్ డేట్లను ఖరారు చేస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులతో ఆయన ఆన్‌లైన్‌‌లో మాట్లాడుతూ… సీబీఎస్ఈ సిలబస్‌ను తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 30శాతం కుదించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణంగా జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి-మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామని, కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనవరి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అన్నారు. తర్వాత సంప్రదింపులు జరిపి పరీక్షల తేదీలపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Tags:    

Similar News