ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ పై సీబీఐ కేసు నమోదు

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేసిన కేసులో భాగంగా సీబీఐ గురువారం కేసులు నమోదు చేసింది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తో పాటు అనుబంధ సంస్థ అయిన నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పైనా సీబీఐ కేసులు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదుతో కంపెనీ డైరెక్టర్ సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశి […]

Update: 2021-12-02 07:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేసిన కేసులో భాగంగా సీబీఐ గురువారం కేసులు నమోదు చేసింది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తో పాటు అనుబంధ సంస్థ అయిన నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పైనా సీబీఐ కేసులు నమోదు చేసింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదుతో కంపెనీ డైరెక్టర్ సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశి రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బ్యాంక్ ఆఫ్ బరోడా సీబీఐకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి ఫిర్యాదు చేసింది. వీరి చర్యల వల్ల రూ.61.86 కోట్ల నష్టం కలిగిందని సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది.

Tags:    

Similar News