వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వ‌రుస‌గా మూడో రోజు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. గ‌తంలో వివేక ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేసిన ఇద‌య‌తుల్లా, వైసీపీ కార్య‌క‌ర్త‌ కిర‌ణ్‌కుమార్ యాద‌వ్‌లను బుధవారం కూడా విచారించారు. వారి నుంచి ప‌లు వివ‌రాల‌ను రాబ‌డుతున్నారు. అలాగే వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా సీబీఐ అధికారులు […]

Update: 2021-06-09 09:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వ‌రుస‌గా మూడో రోజు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. గ‌తంలో వివేక ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేసిన ఇద‌య‌తుల్లా, వైసీపీ కార్య‌క‌ర్త‌ కిర‌ణ్‌కుమార్ యాద‌వ్‌లను బుధవారం కూడా విచారించారు. వారి నుంచి ప‌లు వివ‌రాల‌ను రాబ‌డుతున్నారు. అలాగే వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను విచారించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది విచారణ చేస్తున్న సమయంలో సీబీఐ అధికారులకు కరోనా రావడంతో విచారణను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే గత మూడు రోజులుగా మ‌ళ్లీ విచార‌ణను కొన‌సాగిస్తున్నారు.

Tags:    

Similar News