ఒక తలతో మ్యావ్.. రెండో తలతో ఆహారం!

అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతంలో నివసించే కింగ్స్ కుటుంబంలో గత బుధవారం ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. వారు పెంచుకుంటున్న పిల్లి ఆరు పిల్లలు పెట్టింది. ఇందులో అద్భుతం ఏముంది అనుకుంటున్నారా? ఆ ఆరు పిల్లి పిల్లల్లో ఒక పిల్లికి రెండు తలలు ఉన్నాయి. అవును.. ఇలా జరగడం చాలా అరుదు. దీనికి రెండు జతల కళ్లు, రెండు ముక్కులు, రెండు నోర్లు ఉన్నాయి. తమ పిల్లలు ఒత్తిడి చేయడంతో పిల్లి యజమాని బీజే కింగ్ ఆ పిల్లి […]

Update: 2020-05-25 00:53 GMT

అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతంలో నివసించే కింగ్స్ కుటుంబంలో గత బుధవారం ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. వారు పెంచుకుంటున్న పిల్లి ఆరు పిల్లలు పెట్టింది. ఇందులో అద్భుతం ఏముంది అనుకుంటున్నారా? ఆ ఆరు పిల్లి పిల్లల్లో ఒక పిల్లికి రెండు తలలు ఉన్నాయి. అవును.. ఇలా జరగడం చాలా అరుదు. దీనికి రెండు జతల కళ్లు, రెండు ముక్కులు, రెండు నోర్లు ఉన్నాయి. తమ పిల్లలు ఒత్తిడి చేయడంతో పిల్లి యజమాని బీజే కింగ్ ఆ పిల్లి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయింది.

అంతేకాకుండా ఈ పిల్లికి శరీరం ఒక్కటైనా రెండు తలలు ఉన్న కారణంగా రెండు పేర్లు పెట్టాలని కింగ్ కుటుంబం నిర్ణయించుకుంది. అందుకే దీనికి బిస్కెట్ అండ్ గ్రేవీ అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ పిల్లి ఒక తలతో మ్యావ్ అని అరుస్తూ.. మరో తలతో ఆహారం తింటుందని కింగ్ చెప్పారు. ఇలా రెండు తలలతో పుట్టిన పిల్లులను జానుస్ అని పిలుస్తారు. రెండు తలలు గల జానుస్ అనే రోమన్ దేవుడిగా వీటిని పరిగణిస్తారు. అయితే ఇలా పుట్టిన పిల్లులు గరిష్టంగా రెండు రోజులు మాత్రమే బతుకుతాయి. ఇది తెలిసినప్పటికీ దాన్ని ఎక్కువకాలం ప్రాణాలతో ఉంచాలని కింగ్ భార్య కైలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో ఫ్రాంక్ అనే రెండు తలల పిల్లి దాదాపు 15 సంవత్సరాలు బతికి 2006లో గిన్నిస్ రికార్డు సృష్టించిన విషయాన్ని ఆదర్శంగా తీసుకుని ఆమె ఈ ప్రయత్నం చేస్తోంది.

Tags:    

Similar News