కొవిడ్‌తో మరణించిన ఫారెస్ట్ ఉద్యోగుల కుటుంబాలకు క్యాజువాలిటీ ఫండ్

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కారణంగా మృతిచెందిన ఇద్దరు అటవీశాఖ ఉద్యోగుల కుటుంబాలకు కొవిడ్ క్యాజువాలిటీ ఫండ్ ను వైల్డ్ లైఫ్ ట్రస్ట్ సహకారంతో అందజేసినట్లు ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్, అమ్రాబాద్ ఎఫ్ డీవో రోహిత్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ శాఖకు చెందిన ఎఫ్ఎస్ వో నఫీజ్, ఫారెస్ట్ టోల్ గేట్ అసిస్టెంట్ బాలకృష్ణ కరోనాతో పోరాడి మరణించినట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని, ఆర్థిక చేయూతనందించాలని […]

Update: 2021-06-11 10:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కారణంగా మృతిచెందిన ఇద్దరు అటవీశాఖ ఉద్యోగుల కుటుంబాలకు కొవిడ్ క్యాజువాలిటీ ఫండ్ ను వైల్డ్ లైఫ్ ట్రస్ట్ సహకారంతో అందజేసినట్లు ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్, అమ్రాబాద్ ఎఫ్ డీవో రోహిత్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ శాఖకు చెందిన ఎఫ్ఎస్ వో నఫీజ్, ఫారెస్ట్ టోల్ గేట్ అసిస్టెంట్ బాలకృష్ణ కరోనాతో పోరాడి మరణించినట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని, ఆర్థిక చేయూతనందించాలని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ను కోరగా వారు వెంటనే అంగీకరించి ఇద్దరికీ చెరో రూ.లక్ష చొప్పున అందజేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు గ్రీన్ వారియర్లు శాఖకు అందించిన సేవలకు గాను వారి ఫొటోలతో జ్ఞాపికలను సిద్ధం చేసినట్లు వారు తెలిపారు.

Tags:    

Similar News