ముగిసిన ఈడీ సోదాలు.. నాయిని అల్లుడు ఇంట్లో భారీగా నగదు సీజ్

దిశ, వెబ్ డెస్క్ : ఈఎస్ఐ స్కాంలో ఈడీ సోదాలు ముగిశాయి. నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈరోజు ఉదయం 5గంటల వరకు సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో 24 గంటల పాటు ఈడీ సోదాలు జరిగాయి. ఈడీ సోదాల్లో రూ. 3 కోట్లకు పైగా నగదు. రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలు, బ్లాంక్ చెక్, ఎలక్ట్రానిక్ డివైస్, డిజిటల్ ఎవిడెన్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాయిని మాజీ […]

Update: 2021-04-10 21:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈఎస్ఐ స్కాంలో ఈడీ సోదాలు ముగిశాయి. నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈరోజు ఉదయం 5గంటల వరకు సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో 24 గంటల పాటు ఈడీ సోదాలు జరిగాయి. ఈడీ సోదాల్లో రూ. 3 కోట్లకు పైగా నగదు. రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలు, బ్లాంక్ చెక్, ఎలక్ట్రానిక్ డివైస్, డిజిటల్ ఎవిడెన్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నాయిని మాజీ పీఎస్ ముకంద్ రెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నగరంలో మొత్తం ఏడుచోట్ల ఈడీ రైడ్స్ జరిగాయి.

 

Tags:    

Similar News