నగదు ప్రవాహం.. చెక్‌పోస్టు వద్ద 3.5లక్షల రూపాయలు పట్టివేత

దిశ, కమలాపూర్ : హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో పోలీసులు నిఘాను పెంచారు. ఈ క్రమంలోనే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం ఎటువంటి ఆధారాలు లేని రూ. 3.5 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన గండ్ర గోపాల్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై గ్రామానికి వస్తుండగా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. అతని వద్ద పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో […]

Update: 2021-10-22 10:50 GMT

దిశ, కమలాపూర్ : హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో పోలీసులు నిఘాను పెంచారు. ఈ క్రమంలోనే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం ఎటువంటి ఆధారాలు లేని రూ. 3.5 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన గండ్ర గోపాల్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై గ్రామానికి వస్తుండగా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీలు చేశారు.

అతని వద్ద పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో అతన్ని విచారించారు.అయితే, ఆ డబ్బు పంట అమ్మితే వచ్చిందని గోపాల్ చెప్పగా.. అందుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు నిఘాను పెంచినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News