ఈటలను ఇరికిస్తున్నారు.. మాజీ మంత్రి చుట్టూ కేసులు

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చక్రబంధంలో ఇరికిస్తున్నారు. దేవరయాంజల్​భూముల అంశం నడుస్తుండగానే ఆర్థిక దిగ్భందం చేస్తుండగా… తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని, గతంలో దీనిపై ఫిర్యాదు చేశామంటూ పాత లేఖలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఎగ్జిబిషన్‌లో సొసైటీ తీర్మానాలు లేకుండా అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇచ్చారని, ఏకపక్షంగా సభ్యత్వాలు ఇచ్చారంటూ గతంలో ఫిర్యాదు చేసిన పత్రాలను విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా నాంపల్లి […]

Update: 2021-07-03 20:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చక్రబంధంలో ఇరికిస్తున్నారు. దేవరయాంజల్​భూముల అంశం నడుస్తుండగానే ఆర్థిక దిగ్భందం చేస్తుండగా… తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని, గతంలో దీనిపై ఫిర్యాదు చేశామంటూ పాత లేఖలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఎగ్జిబిషన్‌లో సొసైటీ తీర్మానాలు లేకుండా అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇచ్చారని, ఏకపక్షంగా సభ్యత్వాలు ఇచ్చారంటూ గతంలో ఫిర్యాదు చేసిన పత్రాలను విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై మే 25న సీఎం కేసీఆర్‌కు లాల్‌బహదూర్ కాలేజ్ మాజీ సెక్రటరీ రవీంద్ర సేన లేఖ రాసినట్లు తెరపైకి తీసుకువచ్చారు.

2014 నుంచి ఎగ్జిబిషన్​సొసైటీకి రాజేందర్​చైర్మన్‌గా ఉండగా.. గత నెల 15న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ జరిగిన అక్రమాలపై నాంపల్లి సొసైటీ చైర్మన్, సెక్రటరీలను సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్‌కు రవీంద్ర సేన లేఖ రాసినట్లు తాజాగా బయటకు వచ్చింది. సొసైటీలో శుక్రవారం ఏసీబీ దాడులు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమాల వ్యవహారంపై గతంలోనే ఫిర్యాదులు చేశామంటూ లేఖలు విడుదల చేస్తున్నారు.

2018లో ఈటల నితిన్‌తో పాటు 62 మందికి ఏకపక్షంగా సభ్యత్వాలు ఇచ్చారని రవీంద్ర సేన ఆ లేఖలో పేర్కొన్నారు. సొసైటీ ఆదాయాన్ని సభ్యులంతా ఇష్టం వచ్చినట్టు పంచుకున్నారని ఆరోపించారు. ఓ ఫార్మసీ కాలేజీ నుంచి అక్రమంగా రూ. 78 లక్షలు సొసైటీకి మళ్లించారని ఆయన పేర్కొన్నారు. సొసైటీలో ఆడిట్‌ సరిగా జరగలేదని, ఆడిట్​ జరిగితే చాలా అక్రమాలు బయటకు వచ్చేవని, సొసైటీ నుంచి అనవసర ఖర్చులు చేశారని తాజాగా సీఎంకు రాసిన లేఖలో వివరించారు. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు తన సభ్యత్వాన్ని రద్దు చేశారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రవీంద్ర సేన ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా సొసైటీలో అక్రమ నిర్మణాలు చేస్తున్నారని, దానికి ఆర్​అండ్​బీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆర్​అండ్​బీ ఈఈ 2019 నుంచి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫిర్యాదు పత్రాలను బయటకు విడుదల చేశారు. 2019 డిసెంబర్​ 19న దీనిపై ఆర్​అండ్​బీ ఈఈ రమేష్.. హైదరాబాద్​సిటీ కమిషనర్‎కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ ఏడాది మే 28న ఆర్​అండ్​బీ ఈఈ నుంచి ఎగ్జిబిషన్​సొసైటీ సెక్రెటరీ నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలంటూ సూచించారు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు జరుగడం, రికార్డులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈటల రాజేందర్‎ను మరో కేసులో ఇరికిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News