కేసుల దర్యాప్తులో నాణ్యత ఉండాలి: ఏసీపీ సతీష్
దిశ, హుస్నాబాద్: నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అందుకు తగిన బందోబస్తు ఉండాలని ఎసీపీ వాసాల సతీష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి చేపట్టే కేసులను తూతూ మంత్రంగా కాకుండా, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ఆయన అన్నారు. హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో గురువారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డివిజన్ స్థాయి నేర సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలు […]
దిశ, హుస్నాబాద్: నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అందుకు తగిన బందోబస్తు ఉండాలని ఎసీపీ వాసాల సతీష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి చేపట్టే కేసులను తూతూ మంత్రంగా కాకుండా, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ఆయన అన్నారు. హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో గురువారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డివిజన్ స్థాయి నేర సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు. అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేగాకుండా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ‘నేను సైతం’ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి కేసును పరిష్కరించాలని సూచించారు. సతీష్ అధికారులతో పాటు ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేశారు. ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లే సమయంలో ఇళ్ళకు తాళం వేసుకోవాలని, తమ దగ్గర ఉన్న బంగారం, వెండి, డబ్బులు వంటి విలువైన వాటినితమ వెంట తీసుకెళ్లాలని తెలిపారు. మహిళలు ఒంటరిగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.