అసలైన కరోనా ముప్పు ముందుంది : డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ : ఇండియాలో కరోనా తీవ్రత జులైలో మరింతగా ఉధృతమవుతుందని.. ఆ నెలలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు భారత రాయబారి డేవిడ్ నబారో స్పష్టం చేశారు. అంతకుముందు కొంతకాలం పాటు కేసులు స్థిరంగా నమోదవుతాయని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం త్వరగా మేలుకొని, అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే కొవిడ్-19 కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేయగలిగిందని ఆయన ప్రశంసించారు. వేగవంతమైన చర్యల వల్లే భారత్‌లో తక్కువ నష్టం జరిగిందని […]

Update: 2020-05-09 04:12 GMT

న్యూఢిల్లీ : ఇండియాలో కరోనా తీవ్రత జులైలో మరింతగా ఉధృతమవుతుందని.. ఆ నెలలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు భారత రాయబారి డేవిడ్ నబారో స్పష్టం చేశారు. అంతకుముందు కొంతకాలం పాటు కేసులు స్థిరంగా నమోదవుతాయని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం త్వరగా మేలుకొని, అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే కొవిడ్-19 కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేయగలిగిందని ఆయన ప్రశంసించారు. వేగవంతమైన చర్యల వల్లే భారత్‌లో తక్కువ నష్టం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య పెరగడం సహజమే.. కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నబారో చెప్పారు. కేసులు పెరిగే ప్రాంతంలో మరింత కట్టడి పెంచితే సత్ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగానే కరోనాను నిలువరించగలిగామని నబారో తెలిపారు. ఇండియాలో అధిక జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువేనని నబారో అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లోనే మరణాలు ఎక్కువగా సంభవించాయని ఆయన చెప్పారు. మరికొంత కాలం లాక్‌డౌన్‌ను పొడిగించడం ద్వారా భారత్‌లో కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News