కరోనాపై అసత్య పోస్టులు… పోలీసుల కొరడా
దిశ, వరంగల్: కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఐదు కేసులను నమోదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా వెబ్ ఛానెల్స్ తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం, అధే విధంగా ఎలాంటి సంఘటనలు జరగకున్నా తప్పుడు వీడియోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసినవారిపై కేసులు నమోదు చేసినట్టు కమిషనర్ రవీందర్ తెలిపారు. అదే విధంగా కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో […]
దిశ, వరంగల్: కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఐదు కేసులను నమోదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా వెబ్ ఛానెల్స్ తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం, అధే విధంగా ఎలాంటి సంఘటనలు జరగకున్నా తప్పుడు వీడియోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసినవారిపై కేసులు నమోదు చేసినట్టు కమిషనర్ రవీందర్ తెలిపారు. అదే విధంగా కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పోస్టు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.కరోనా వ్యాధి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తర్వులను అతిక్రమించి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన1674 వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్టు తెలిపారు.
Tags : police Case, against, people, false claims, social media, corona, warangal