నారా లోకేశ్‌తో పాటు మరో ముగ్గురిపై కేసులు..
దిశ, ఏపీ బ్యూరో: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంపై మంగళవారం వైసీపీ నేతలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేస్తోంది. వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ బుధవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో టీడీపీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు […]
దిశ, ఏపీ బ్యూరో: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంపై మంగళవారం వైసీపీ నేతలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేస్తోంది. వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ బుధవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో టీడీపీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా లోకేశ్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్‌లుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.