టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
దిశ, హాలియా: టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయించిన ఒక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలు జరుగుతుండగా… మరికొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్ త్రిపురారం మండలంలోని పలు తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. […]
దిశ, హాలియా: టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయించిన ఒక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలు జరుగుతుండగా… మరికొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్ త్రిపురారం మండలంలోని పలు తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయించారు.
దీనిపై ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈసీ.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు త్రిపురారం ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపారు.