టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
దిశ,మహబూబాబాద్ : మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సహా 17 మంది ఆయన అనుచరులపై మంగళవారం కేసు నమోదైంది. నెల్లికుదుర్ ఎస్సై ఫణిదర్.. ఈ కేసు ఎందుకు ఫైల్ చేశారో మీడియాకు వివరించారు. ఈ నెల 14న జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ సమయంలో పార్వతమ్మ గూడెంలోని ఓ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అక్కడి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీనిపై […]
దిశ,మహబూబాబాద్ : మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సహా 17 మంది ఆయన అనుచరులపై మంగళవారం కేసు నమోదైంది. నెల్లికుదుర్ ఎస్సై ఫణిదర్.. ఈ కేసు ఎందుకు ఫైల్ చేశారో మీడియాకు వివరించారు. ఈ నెల 14న జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ సమయంలో పార్వతమ్మ గూడెంలోని ఓ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అక్కడి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీనిపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తో సహా 17 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతోపాటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ లతో సహా 12 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. కాగా సోమవారం 11 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.