బ్రేకింగ్: కిషన్ రెడ్డి ప్రచారంలో ఎస్ఐపై దాడి.. టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
దిశ, జమ్మికుంట: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో శుక్రవారం ప్రొబేషనరీ ఎస్ఐ రజనీకాంత్‌పై దాడికి పాల్పడ్డ ఇరువురు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో గొడవను ఆపేందుకు […]
దిశ, జమ్మికుంట: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో శుక్రవారం ప్రొబేషనరీ ఎస్ఐ రజనీకాంత్‌పై దాడికి పాల్పడ్డ ఇరువురు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో గొడవను ఆపేందుకు వచ్చిన ఎస్ఐ రజనీకాంత్‌పై దాడి చేసిన టీఆర్ఎస్ నేత ప్రవీణ్, చిన్న రాయుడుపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అంతేగాకుండా.. ఈ దాడిలో పాల్గొన్న మరికొందరిని గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పోలీసుల విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీలు వెంకట్ రెడ్డి, మహేష్, సీఐ సురేష్‌లు ఉన్నారు.ల