నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు

దిశ, ఏపీబ్యూరో : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన‌ నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు నమోదు చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదాన్ని అంద‌జేస్తామంటూ డిసెంబ‌రు 6న ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు వెంట‌నే రంగంలోకి దిగిన విజిలెన్స్‌, ఐటీ విభాగాల అధికారులు స‌ద‌రు […]

Update: 2020-12-10 11:41 GMT

దిశ, ఏపీబ్యూరో : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన‌ నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు నమోదు చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదాన్ని అంద‌జేస్తామంటూ డిసెంబ‌రు 6న ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు వెంట‌నే రంగంలోకి దిగిన విజిలెన్స్‌, ఐటీ విభాగాల అధికారులు స‌ద‌రు న‌కిలీ వెబ్‌సైట్‌ను గుర్తించారు. ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించారు.

Tags:    

Similar News