హరీశ్‌రావుపై అభ్యంతరకర పోస్టులు.. మాజీ కౌన్సిలర్‌పై కేసు

దిశ ప్రతినిధి, మెదక్ : మంత్రి హరీశ్ రావు పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన మాజీ కౌన్సిలర్ పై సిద్దిపేట వన్ టౌన్ లో కేసు నమోదైంది. గతంలో సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ గా బీజేపీ నుండి గెలుపొందిన బాసంగారి వెంకట్ తరువాత టీఆర్ఎస్ లో చేరారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వెంకట్, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయారు. నాటి […]

Update: 2021-08-14 05:43 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : మంత్రి హరీశ్ రావు పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన మాజీ కౌన్సిలర్ పై సిద్దిపేట వన్ టౌన్ లో కేసు నమోదైంది. గతంలో సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ గా బీజేపీ నుండి గెలుపొందిన బాసంగారి వెంకట్ తరువాత టీఆర్ఎస్ లో చేరారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వెంకట్, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుండి అధికార పార్టీ, మంత్రి హరీశ్ రావు పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మాజీ కౌన్సిలర్ వెంకట్ పై సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం సిద్ధిపేట వన్ టౌన్ పోలీసులు మాజీ కౌన్సిలర్ వెంకట్ ను స్టేషన్ కు పిలిచి 4 గంటలు వార్నింగ్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలలో పెట్టిన పోస్టుల ఆధారంగా కేసులు చేయరాదని ఉన్నత న్యాయస్థానం ప్రకటించినా.. స్థానిక పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయడం స్థానికంగా మరో చర్చకు దారి తీసింది.

Tags:    

Similar News