వరంగల్ అర్బన్‌లో మరో పాజిటివ్

దిశ, వరంగల్: రాష్ట్రంలో ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చాక కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.శనివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కుమార్ పల్లికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత దేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుడు మూడ్రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షల జరిపి ఏమీ అర్థంకాక ఎంజీఎంకు రిఫర్ చేశారు. అక్కడ కూడా […]

Update: 2020-05-30 09:11 GMT

దిశ, వరంగల్:
రాష్ట్రంలో ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చాక కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.శనివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కుమార్ పల్లికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత దేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుడు మూడ్రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షల జరిపి ఏమీ అర్థంకాక ఎంజీఎంకు రిఫర్ చేశారు. అక్కడ కూడా పరీక్షలు జరపగా కోవిడ్-19 పాజిటివ్ తేలింది. దీంతో అతన్నివెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.

Tags:    

Similar News