కరోనా రోగిపై హత్యాయత్నం కేసు

ప్రాణాలకు తెగించి వైద్యులు కరోనా బాధితులకు చికిత్స అందిస్తుంటే… మరో వైపు కరోనా రోగి ఓ వైద్యుడిపైనే ఉమ్మివేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోవిడ్-19 సోకిన 40 ఏళ్ల ఓ వ్యక్తి శనివారం రాత్రి తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స‌కు సహకరించపోగా, బాధితుడు తన మాస్క్‌ను తీసి వైద్యులపై విసిరేశాడు. తాజాగా చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడు పై ఉమ్మి వేయడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో కరోనా […]

Update: 2020-04-12 20:51 GMT

ప్రాణాలకు తెగించి వైద్యులు కరోనా బాధితులకు చికిత్స అందిస్తుంటే… మరో వైపు కరోనా రోగి ఓ వైద్యుడిపైనే ఉమ్మివేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోవిడ్-19 సోకిన 40 ఏళ్ల ఓ వ్యక్తి శనివారం రాత్రి తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స‌కు సహకరించపోగా, బాధితుడు తన మాస్క్‌ను తీసి వైద్యులపై విసిరేశాడు. తాజాగా చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడు పై ఉమ్మి వేయడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో కరోనా రోగిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags: carona patient, spit, doctor, tamilnadu

Tags:    

Similar News