భారత్‌లో కరోనా @ 7,67,296
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజకూ తారా స్థాయిని చేరుతోంది. ఇప్పటికే కొవిడ్ వ్యాప్తిలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచిన దేశం రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇండియాలో మొత్తంగా 7,67,296 మంది కరోనా బారిన పడ్డారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 24,879కేసులు నమోదు కాగా, 487 మంది మృతి చెందారు. అయితే, మొత్తం […]
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజకూ తారా స్థాయిని చేరుతోంది. ఇప్పటికే కొవిడ్ వ్యాప్తిలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచిన దేశం రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇండియాలో మొత్తంగా 7,67,296 మంది కరోనా బారిన పడ్డారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 24,879కేసులు నమోదు కాగా, 487 మంది మృతి చెందారు. అయితే, మొత్తం కరోనా మృతుల సంఖ్య 21,129కి చేరింది. మన దేశంలో ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులుండగా, కరోనా నుంచి కోలుకుని 4,76,377 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.