వరల్డ్ చాంపియన్‌షిప్స్ నుంచి మారిన్ ఔట్
దిశ, స్పోర్ట్స్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ నుంచి స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ వైదొలగింది. సొంత నగరంలో జరుగుతున్న ఈ మేజర్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి స్పెయిన్‌లోని హ్యూల్వాలో వరల్డ్ చాంపియన్‌షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానున్నది. డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు ఈ టోర్నీ కోసం ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నది. అయితే గత కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న మారిన్ ఈ ఏడాది పలు టోర్నీల్లో పాల్గొనలేదు. ఆల్ ఇంగ్లాండ్ […]
దిశ, స్పోర్ట్స్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ నుంచి స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ వైదొలగింది. సొంత నగరంలో జరుగుతున్న ఈ మేజర్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి స్పెయిన్‌లోని హ్యూల్వాలో వరల్డ్ చాంపియన్‌షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానున్నది. డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు ఈ టోర్నీ కోసం ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నది. అయితే గత కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న మారిన్ ఈ ఏడాది పలు టోర్నీల్లో పాల్గొనలేదు.
ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్న తర్వాత స్విస్ ఓపెన్ బరిలోకి కూడా దిగలేదు. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మారిన్.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టోక్యో ఒలింపిక్స్‌ను కూడా వదిలేసింది. తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలోకి దిగుతానని ముందుగా పేర్కొన్నది. ఆమెకు నిర్వాహకులు డ్రా కూడా తీశారు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే పీవీ సింధుతో సెమీస్‌లో తలపడవలసి వచ్చేది. కానీ, గాయం కారణంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కాగా, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ను మారిన్ మూడు సార్లు గెలుచుకోవడం విశేషం.