యూపీఎస్సీ నుంచి 69 పోస్టులకు నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ,కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 69
పోస్టుల వారీగా అర్హత, వయసు వివరాలు:
రీజినల్ డైరెక్టర్ : ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ బోటనీ/ ప్లాంట్ పాథాలజీ/ మైకాలజీ) ఉత్తీర్ణత. ఈ ఉద్యోగాలకు వయసు-55 ఏళ్లు ఉండాలి.
అసిస్టెంట్ కమిషనర్: మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు-40 ఏళ్లు.
అసిస్టెంట్ ఓర్ డ్రెస్సింగ్ ఆఫీసర్: డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు-35 ఏళ్లు.
అసిస్టెంట్ మినరల్ ఎకానమిస్ట్: బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు-35 ఏళ్లు.
అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు-30 ఏళ్లు.
యూత్ ఆఫీసర్ - మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు-30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది: ఏప్రిల్ 13, 2023.
వెబ్సైట్: https://www.upsc.gov.in