UPSC సీఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2025
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది
దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ భాగంగా మొత్తం 705 కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్ష పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBBS ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 19-02-2025 న ప్రారంభమై 11-03-2025 ముగుస్తుంది.
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు: లేదు
ఇతర అభ్యర్థులకు: రూ. 200/-
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 19-02-2025
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 11-03-2025
వయోపరిమితి :
వయోపరిమితి: (01-08-2025 నాటికి) 32 సంవత్సరాలు ఉండాలి.
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అర్హత :
అభ్యర్థులు MBBS పూర్తి చేసి ఉండాలి.
ఖాళీల వివరాలు :
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ ఇన్ సెంట్రల్ హెల్త్ సర్వీస్ సబ్-కేడర్ - 226
రైల్వేలలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ - 450
న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 09
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ Gr-II - 20