పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
ఇందులో హైదరాబాద్ రీజియన్‌లో 70 ఖాళీలున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్).. 2023-24 ఏడాదికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ రీజియన్‌లో 70 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
మొత్తం పోస్టులు :1045
ఖాళీల వివరాలు :
కార్పొరేట్ సెంటర్ (గుడ్‌గావ్) -53
నార్తర్న్ రీజియన్ - 1 (ఫరీదాబాద్) - 135
నార్తెర్న్ రీజియన్ - 2 (జమ్ము) - 79
నార్తెర్న్ రీజియన్ -3 (లఖ్‌నవూ)- 93
ఈస్ట్రన్ రీజియన్ -1 (పట్నా) - 70
ఈస్ట్రన్ రీజియన్ -2 (కోల్‌కతా) -67
నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్) -115
ఒడిశా ప్రాజెక్ట్స్ (భువనేశ్వర్) -47
వెస్ట్రన్ రీజియన్ -1 (నాగ్‌పూర్) - 105
వెస్ట్రన్ రీజియన్ - 2 (వడోదర) - 106
సదరన్ రీజియన్ -1 (హైదరాబాద్) -70
సదరన్ రీజియన్ - 1 (బెంగళూరు) - 105
అర్హత: విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటిఐ, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎల్ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
కనీస వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.
శిక్షణ కాలం: ఏడాది.
స్టైపెండ్: విభాగాన్ని అనుసరించి నెలకు రూ. 13,500 నుంచి రూ. 17500 ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: జులై 31, 2023
వెబ్‌సైట్: https://www.powergrid.in/