టీఎంబీలో ప్రొబేషనరీ క్లర్కులు..

Update: 2023-11-05 13:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు మర్చంటైల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (టీఎంబీ) ప్రొబేషనరీ క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 72 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 17, తెలంగాణకు 7 కేటాయించారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

అర్హతలు: అభ్యర్థులు 31.08.2023 నాటికి ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ అది తప్పనిసరికాదు. అభ్యర్థి డిగ్రీ చదివితే 24 ఏళ్లు, పీజీ చదివితే 26 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో బీసీలకు రెండేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.600 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.

ఎంపిక: ఫేజ్‌-1లో జరిగే ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫేజ్‌-2లోని ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాత పరీక్ష ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ క్లర్క్‌ స్థాయిలో ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష: ఈ పరీక్షలో 5 సెక్షన్లు ఉంటాయి.

1) రీజనింగ్‌. 40 ప్రశ్నలకు 40 మార్కులు

2) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌. 40 ప్రశ్నలకు 40 మార్కులు

3) కంప్యూటర్‌ నాలెడ్జ్‌. 40 ప్రశ్నలకు 40 మార్కులు

4) జనరల్‌ అవేర్‌నెస్‌ (బ్యాంకింగ్‌). 40 ప్రశ్నలకు 40 మార్కులు

5) న్యూమరికల్‌ ఎబిలిటీ. 40 ప్రశ్నలకు 40 మార్కులు

మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్‌.

దరఖాస్తుకు చివరి తేదీ: 06.11.2023

ఆన్‌లైన్‌ పరీక్ష: నవంబరు 2023

పరీక్ష ఫలితాలు: డిసెంబరు 2023

ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌: డిసెంబరు 2023/ జనవరి 2024

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: జనవరి 2024

వెబ్‌సైట్‌: www.tmbnet.in


Similar News