పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. స్టైఫండ్ ప్రకటించిన మంత్రి గంగుల
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న వేళ పేద విద్యార్థులను దృష్టిలోThe government will provide free training for competitive examinations
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న వేళ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను ఇవ్వనుంది.
* ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు.
*వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారికి ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని మంత్రి చెప్పారు.
*ఎంపిక ప్రక్రియ నిర్వహించి ఏప్రిల్ 21 నుంచి 1,25,000 మంది నిరుద్యోగలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
*గ్రూప్1, గ్రూప్2 , ఎస్ఐ రాసే 10వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.
*గ్రూప్1 అభ్యర్థులకు 6నెలల పాటు నెలకు రూ.5వేలు, గ్రూప్ 2 అభ్యర్థులకు మూడు నెలల పాటు రూ.2వేలు, ఎస్ఐ అభ్యర్థులకు నెలకు రూ.2వేలు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు.