బీటెక్ అర్హతతో హైదరాబాద్ NFCలో జాబ్స్, నెలకు రూ.67వేలకు పైగా వేతనం, దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు

Update: 2022-03-03 05:17 GMT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని న్యూక్లియార్ ఫ్ల్యూయల్ కాంప్లెక్స్(NFC) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 11

* కెమిస్ట్రీ, కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 40 ఏళ్ల వయస్సు మించకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.67,700 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Assistant Personnel Officer, Recruitment – ​​1, Nuclear Fuel Complex, ECIL Post, Hyderabad – 500062 చిరునామకు పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nfc.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Tags:    

Similar News