EMRS పాఠశాలల్లో 4062 టీచింగ్ & నాన్‌టీచింగ్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్‌టీఎస్) దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Update: 2023-06-29 11:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్‌టీఎస్) దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 4062

ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఈఎస్ఎస్‌ఈ) - 2023

పోస్టుల వివరాలు:

ప్రిన్సిపల్ - 303

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 2266

అకౌంటెంట్ - 361

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 759

ల్యాబ్ అటెండెంట్ - 373

విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి. హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ.. విభాగాలున్నాయి.

అర్హత:

1. ప్రిన్సిపల్ : బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లకు మించరాదు.

2. పీజీటీ: బీఈడీ, పీజీ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 40 ఏళ్లకు మించరాదు.

3. అకౌంటెంట్: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

4.జేఎన్ఏ: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

5. ల్యాబ్ అటెండెంట్: 10/12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించరాదు.

ఎంపిక: ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: ప్రిన్సిపల్ పోస్టుకు రూ. 2000, పీజీటీలకు రూ. 1500, నాన్ టీచింగ్ పోస్టులకు రూ. 1000 చెల్లించాలి.

చివరితేదీ: జులై 31, 2023

వెబ్‌సైట్: https://emrs.tribal.gov.in/


Similar News