SSC Recruitment 2023: ఇంటర్‌ అర్హతతో కేంద్రంలో ఉద్యోగం..

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం.

Update: 2023-08-07 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవాళ్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్రానికి చెందిన రీజనల్‌ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో చేరినవారు మొదటి నెల నుంచే రూ.35,000 వేతనంతోపాటు ఇతర సౌకర్యాలూ పొందవచ్చు. ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందువల్ల అభ్యర్థులకు స్టెనోగ్రఫీలో పరిచయం లేనప్పటికీ ఇప్పటి నుంచి రోజూ కొంత సమయం కేటాయించి సాధన చేస్తే సరిపోతుంది. పరీక్ష అనంతరం ఉన్న వ్యవధిని సద్వినియోగ పరచుకుంటే స్టెనోలో అర్హత సాధించవచ్చు.

ఖాళీలు: 1207

అర్హత: ఇంటర్మీడియట్‌/ సమాన కోర్సును పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి పోస్టులకు ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1993 - ఆగస్టు 1, 2005 లోపు జన్మించినవారు అర్హులు.

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి పోస్టులకు ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1996 - ఆగస్టు 1, 2005 మధ్య జన్మించినవారు

అర్హులు: ఈ రెండు పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారికి రూ. వంద

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: ఆగస్టు 23

ఆన్‌లైన్‌ పరీక్షలు: అక్టోబరులో

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్‌, వరంగల్‌. ఏపీలో.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


Similar News