Results: మరికాసేపట్లో DSC పరీక్షల ఫలితాలు విడుదల

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన DSC పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

Update: 2024-09-30 02:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన DSC పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. అయితే డీఎస్సీ పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్‌ ర్యాంకులను వెల్లడించనున్నారు. అనంతరం జిల్లాల వారీగా ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. వీటి ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

కాగా రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి జులై 8నుంచి ఆగస్టు 5న తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రాథమిక కీ తో పాటు తుది కీని కూడా విడుదల చేశారు. తుది కీపై అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.


Similar News