GATE 2025 : గేట్ 2025 రిజిస్ట్రేషన్.. రేపటి నుండే ప్రారంభం..

ఐఐటీ గేట్ 2025 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపు, ఆగస్టు 28న ప్రారంభం కానుంది.

Update: 2024-08-27 11:20 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఐఐటీ గేట్ 2025 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపు, ఆగస్టు 28న ప్రారంభం కానుంది. పరీక్ష రాయాలనుకునేవారు 26 సెప్టెంబర్ 2024 వరకు అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.inకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2025 పరీక్షను రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తుంది. ఐఐటీ రూర్కీ ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఇంతకుముందు GATE 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 24 నుండి ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. అభ్యర్థులు ఆలస్య రుసుముతో అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, విద్యార్థులు IIT రూర్కీ జారీ చేసిన GATE 2025 నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.

గేట్ 2025 దరఖాస్తు రుసుము వివరాలు..

జనరల్ అభ్యర్థులకు ఒక్కో పరీక్ష పేపర్‌కు దరఖాస్తు ఫీజు రూ.1800గా నిర్ణయించారు. ఆలస్య రుసుము రూ. 2300. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు దరఖాస్తు ఫీజు రూ.900, ఆలస్య రుసుము రూ.1400గా నిర్ణయించారు.

గేట్ 2025 రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి..

GATE 2025 gate2025.iitr.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.

ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్‌ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు అవసరమైన సమాచారాన్ని నమోదు చేసుకోండి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి ఫీజు పే చేయండి.

తరువాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

గేట్ 2025 పరీక్ష తేదీ..

విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, GATE 2025 పరీక్ష 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు మూడు పరీక్ష నగరాలను ఎంచుకోవచ్చు.

గేట్ 2025 అడ్మిట్ కార్డ్ ..

అడ్మిట్ కార్డ్‌కు ముందే ఎగ్జామ్ సిటీ స్లిప్ జారీ చేస్తారు. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు హాల్ టికెట్ జారీ చేయవచ్చు. నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి పరీక్ష అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Similar News