నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. జులై 2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,కెరీర్: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. జులై 2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఫుల్ టైం/పార్ట్ టైం పీహెచ్‌డీ డిగ్రీ ప్రోగ్రామ్‌కు అవకాశం కల్పిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఈ పీహెచ్‌డీ ప్రోగ్రాం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రోగ్రామ్:
పార్ట్ టైం/ఫుల్ టైం పీహెచ్‌డీ డిగ్రీ ప్రోగ్రామ్.
విభాగాలు:
సివిల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
బయోటెక్నాలజీ
మ్యాథ్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
అర్హత: విభాగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్/క్యాట్/యూజీసీ/సీఎస్ఐఆర్/ఇన్‌స్పైర్/నెట్ స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు: రూ. 1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 800 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: మే 29, 2023.
రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీ: జూన్ 12 నుంచి 17, 2023
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/