పీజీ మెడికల్ ప్రవేశాలు ప్రక్రియ షురూ

పీజీ మెడికల్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది.

Update: 2022-10-22 13:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీ మెడికల్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్‌ 2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 25 శాతానికి 201 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 15 శాతానికి 186 మార్కులు, దివ్యాంగులకు 20 శాతానికి 169 మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు. కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు ఈనెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుండి నుండి 26వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అదే విధంగా యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి 27వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News