స్పా..విజయవాడలో నాన్ టీచింగ్ ఖాళీలు.. ఎంపిక ఎలాగంటే?
విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. డైరెక్ట్ రిక్రూట్మెంట్/డిప్యూటేషన్‌పై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. డైరెక్ట్ రిక్రూట్మెంట్/డిప్యూటేషన్‌పై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్) - 1
సెక్షన్ ఆఫీసర్ - 2
ప్రైవేట్ సెక్రటరీ - 1
అకౌంటెంట్ - 1
పర్సనల్ అసిస్టెంట్ (డైరెక్ట్/డిప్యుటేషన్) - 2
జూనియర్ సూపరింటెండెంట్ (టెక్నికల్) (డైరెక్ట్/డిప్యుటేషన్) - 2
టెక్నికల్ అసిస్టెంట్ - 5
లైబ్రరీ అసిస్టెంట్ - 1
గ్రాఫిక్ డిజైనర్/సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (పబ్లికేషన్స్) - 1
గ్రాఫిక్ అసిస్టెంట్/టెక్నికల్ అసిస్టెంట్ (పబ్లికేషన్స్) - 1
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాట వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటిఐ రోడ్, విజయవాడ అనే చిరునామాకు పంపాలి.
చివరితేదీ: జులై 31, 2023
వెబ్సైట్: https://www.spav.ac.in/index.html