Big Alert:నేటి నుంచే EAPCET ఎగ్జామ్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
ఏపీలోని ప్రభుత్వ , ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏపీ EAPCET -2024 గురువారం నుంచి మొదలు కానుంది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రభుత్వ , ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏపీ EAPCET -2024 గురువారం నుంచి మొదలు కానుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజూ రెండు షిప్టుల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్‌టీయూ (కాకినాడ) పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఈ నెల 23వ తేదీ వరకు జరగనుంది. ఈ ప్రవేశ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. ఈ నెల 16,17 తేదీల్లో బైపీసీ, 18 నుంచి 23 వరకు ఎంపీసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా తమతో పాటు హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని రావాలన్నారు. ఈ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే డీబార్ చేస్తామని హెచ్చరించారు.