NHLML Recruitment: నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్మెంట్ లో ఉద్యోగాలు.. డీటెయిల్స్ ఇవే..!
ఢిల్లి(Delhi)లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్(NHLML) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లి(Delhi)లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్(NHLML) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 07 కంపెనీ సెక్రటరీ(Company Secretary) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://nhlml.org/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
కంపెనీ సెక్రటరీ - 07
విద్యార్హత:
పోస్టును బట్టి డిగ్రీ, సీఏ, సీఎంఏ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
40 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 84,100 జీతం ఉంటుంది.