ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి..
నిరుద్యోగులకు మంచి అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంఎస్ఎంఈ విభాగం కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 7
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ మేనేజర్ 3, మేనేజర్ 3, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఎంసీఏ తో పాటు డేటా మేనేజ్ మెంట్ స్కిల్స్ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
*వయోపరిమితికి సంబంధించి ఉద్యోగాన్ని బట్టి 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళ అభ్యర్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.