ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు

విజయవాడలోని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్/డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-06-25 16:07 GMT

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలోని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్/డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

జూనియర్ అసిస్టెంట్ - 11 పోస్టులు

డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 1

వేతనం: నెలకు జూ.అసిస్టెంట్‌కు రూ. 18,500 ఉంటుంది. డీపీ అసిస్టెంట్‌కు రూ. 18, 500 చెల్లిస్తారు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, టైపింగ్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికెట్/కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పరీక్ష ఫీజు: రూ. 500 చెల్లించాలి.

ఎంపిక: పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేదీ: జులై 7, 2023.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ: జులై 13, 2023; జులై 14, 2023.

వెబ్‌సైట్: https://dge-ap.aptonline.in/


Similar News